logo

నేడు మీసాల గీత నామినేషన్ ఆత్మగౌరవం పేరుతో బరిలోకి... తడాఖా చూపుతానంటున్న మీసాల గీత



విజయనగరం
విజయనగరం అసెంబ్లీ
నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా (నేడు)
శుక్రవారం నాడు మాజీ ఎమ్మెల్యే మీసాల
గీత నామినేషన్ వేయనున్నారు.
ఆత్మగౌరవం నినాదంతో ఆమె స్వతంత్ర
అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.
2019లో తాను సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా
కూడా తనకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం
కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా
టికెట్ను వేరొకరికి కేటాయించి అవమానించిందని ఇన్నాళ్లు లోలోన మధన పడ్డ
గీత, ఈ ఎన్నికల్లో తనకే పార్టీ టిక్కెట్ కేటాయిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.
అయితే గత ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసిన ఓడిన పూసపాటి అధితి
గజపతిరాజుకే మళ్లీ టీడీపీ టిక్కెట్ కేటాయించడంతో మీసాల గీత అవమానంగా
భావించారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి అంకిత భావంతో ఇన్నాళ్లూ పనిచేశానని,
అయినా పార్టీ తనను పట్టించుకోకుండా తీవ్ర అవమానాలు పాలు చేసిందని ఆవేదన
వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో ఖచ్చితంగా తనకు టిక్కెట్ ఇస్తామని చెప్పి
చివరికి ఇవ్వకుండా అవమానించడంతో ఆమె స్వతంత్ర అభ్యర్ధిగా నేడు బరిలో
నిలిచి తన తడాఖా చూపిస్తానంటున్నారు ఆమె. బీసీలు అత్యధికంగా ఉన్న
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి మీ ఆడబిడ్డగా ఎన్నికల బరిలో
దిగుతున్నానని, ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని
ఈ సందర్భంగా మీసాల గీత విజయనగర నియోజకవర్గం ప్రజలను కోరారు.
నేడు నామినేషన్ వేయనున్న నేపధ్యంలో అట్టహాసంగా కార్యక్రమాన్ని
నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

0
0 views